రామకృష్ణాపూర్, ముద్ర : ఇటీవల పున: ప్రారంభించిన కాజీపేట్ అజ్ని ప్యాసింజర్ రైలును ప్రయాణికుల సౌకర్యార్థం రవీంద్రఖనిలో హాల్టింగ్ కల్పించాలని పట్టణ కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి ఎంపి గడ్డం వంశీకృష్ణను కోరారు.శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలో పర్యటించిన ఆయనకు నాయకులు వినతి పత్రాన్ని అందించారు.అనంతరం అనారోగ్య సమస్యతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోపతి రాజయ్యను పరామర్శించారు.అలాగే ఇటీవల మరణించిన కుదిరే రాజయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు,శ్రీనివాస్,సుధాకర్,భానేష్ పాల్గొన్నారు.