- ఎండిన పంటలకు పాలకులే బాధ్యత వహించాలి
- ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి
- తాటికొండ సీతయ్య మాజీ ఎంపీపీ, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు
తుంగతుర్తి,ముద్ర: కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వల ద్వారా ఎస్సార్ ఎస్పి కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్లు ఇవ్వనందుననే పంట పొలాలు పొట్ట దశలో ఎండిపోయాయని తక్షణమే ఎండిన పొలాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు.ఎస్సారెస్పీ కాల్వాలద్వారా నీళ్ళుస్తాయనే ఆశతో రైతాంగం యాసంగి నాట్లు వేశారని చివరకు పొట్టలమీద ఉన్న పొలం నీళ్లు రాక ఎండి పోతుంటే చూసిన రైతు గుండె గుబెల్ మంటుందని అన్నారు.సూర్యతండా పరిధి లోని ఎండిన పొలాలలో రైతులు బి ఆర్ ఎస్ కార్యకర్తలతో కలిసి నిరసన తెలియ చేశారు.రైతు ఏడ్చినా పాపం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగలడం ఖాయమన్నారు.కావాలని కెసిఆర్ ను బదనామ్ చెయ్యడం కోసం మెడిగడ్డ లో నీళ్లు ఆపకుండా అన్నారం.సుందిళ్ల ప్రాజెక్తులు నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వపెద్దలు ఇసుక లారీలకు లారీలు వేల కొద్ది వ్యాపారం చేస్తున్నారని అన్నారు.కాళేశ్వరం ద్వారా మోటార్లు నడిపించి నీళ్లి చే అవకాశం ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పంటలు ఎండిపోయాయని అన్నారు.గత కెసిఆర్ ప్రభుత్వం లో ఈ సీజన్ లో చెరువు లు నిండుగా నిండి అలుగులు పొసే పరిస్థితి ఉంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం లో చెరువులన్నీ వెల వెల పోతున్నాయని అన్నారు.కావాలని నిర్లక్ష్యం గా ప్రభుత్వం రైతుల పంటలు ఎండబెట్టిందని.ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడాలని రైతులు వేడుకున్న పట్టించుకునే నాథుడేలేడని అన్నారు.అందుకే ఇలాంటి ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కి రానున్న స్థానిక సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పే విధంగా ప్రజలు ముందుకు సాగాలని అన్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బిఆర్ఎస్ నాయకులను గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ లాకావత్ యాకూ నాయక్ మాజీ ఎంపీటీసీ మాన్సింగ్ నాయక్,సీను నాయక్ మంగు నాయక్ బిక్షం నాయక్. యాదగిరి నాయక్. వెంకన్ననాయక్,బద్దు యాదగిరి నాయక్,మహిళా రైతులు. తదితరులు పాల్గొన్నారు.
