ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం నందు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో బాధితుల సమస్యల దిశగా, ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువాయే దిశగా పనిచేయాలని జిల్లా ఎస్పీటి. శ్రీనివాసరావు తెలిపారు.
సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఆర్జీదారుల నుండి 15 ఫిర్యాదులు స్వీకరించారు.
గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా వారి సమస్యలను మా దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.
ప్రేమ పేరుతో మోసం చేశాడని – 01, భూవివాదాలకు సంబంధించి – 03, గొడవలకు సంబంధించి -04, డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని సంబంధించి -01, పొలం గేట్లకు గడ్డి మందు కొట్టడం – 01, ఇంటి స్థలం ఆక్రమణ చేశారని -01, భర్త హరాస్మెంట్ కు సంబంధించి -02, ఇతర అంశాలకు సంబంధించి -02 ఫిర్యాదులు అందాయి.