మొదటి విడతలోనే మండలాల రిపోర్టర్లకు అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలి కలెక్టర్, డిపిఆర్ఓలకు టీయూడబ్ల్యూజే–ఐజేయూ వినతి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ మొదటి విడతలోనే అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ మరియు డిపిఆర్ఓ కిరణ్ కుమార్ లకు శనివారం వినతిపత్రం అందజేశారు.

ముఖ్యంగా మండల స్థాయిలో పనిచేస్తున్న రిపోర్టర్లకు తొలి విడతలోనే అక్రిడిటేషన్లు ఇవ్వాలని కోరారు. గతంలో అక్రిడేషన్ పొందిన అనుభవజ్ఞులైన జర్నలిస్టులకు విద్యార్హతలో సడలింపు కల్పించి కార్డులు జారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
నల్లమల్ల ప్రాంతంలోని మన్ననూరు, బ్రహ్మగిరి కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని, అలాగే రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాసులు అందించాలని కోరారు.
ఈ వినతిపత్రం అందజేసిన వారిలో ఐజేయూ జిల్లా ఉపాధ్యక్షులు, అక్రిడేషన్ కమిటీ సభ్యుడు మోబిన్ ఖాన్, తాలూకా ఉపాధ్యక్షులు జంగిటి రామ్ ప్రకాష్, సీనియర్ నాయకులు కొండకింది మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.