ముద్ర,హుజూర్ నగర్ :
ఈరోజు హుజూర్ నగర్ పట్టణంలో పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మూడు రాష్ట్రాల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా భారీ విజయోత్సవ ర్యాలీని నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ మూడు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ భారీ మెజారిటీ సాధించడం బిజెపి కార్యకర్తలుగా చాలా గర్వపడుతున్నామని అదేవిధంగా ఓటర్లు చాలా తెలివైన వారని నేతలు అధికారం ఉంది కదా అని తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తామంటే ప్రజలు ఇదేవిధంగా కర్రు కాల్చి వాత పెడతారని, ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడే వారికి ఇది ఒక చంపపెట్టు లాంటిదని అదేవిధంగా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఈ స్థాయిలో ఆదరించడం అంటే వారు సుపరిపాలనకు పట్టం కట్టారని ప్రజా అనుకూలమైనటువంటి పరిపాలన చేస్తే ప్రభుత్వాలను ఎన్నిసార్లయినా ఎన్నుకునేందుకు ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అలాగే దక్షిణ భారతదేశంలో ఉన్న నాలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కూడా ఈ ఎన్నికలు తెలియజేశాయని అదేవిధంగా ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అందిస్తున్న సుపరిపాలనకు దేశంలో రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ వస్తుందని, ఇదే ఆదరణ రాబోయే రోజులలో తెలంగాణలో కూడా ఉంటుందని ఇదే స్ఫూర్తి తోటి తెలంగాణలో పనిచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పిడమర్తి చంద్రయ్య, గుండా గోపి, జనిగల శ్రీనివాస్ గౌడ్, మాడుగుల లక్ష్మీనారాయణ, కల్లూరు నితిన్, కామల్ల వంశీ, కొమ్మగాని రామచంద్రు, రుద్రోజు సతీష్, మేకపోతుల పవన్ కుమార్, గునిగంటి నాగరాజు, కొండ వెంకటేశ్వర్లు, వినోద్, పాండ్య మరియు తదితర బిజెపి కార్యకర్తలు స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.