Take a fresh look at your lifestyle.

మాది స్ట్రెయిట్ ఫైట్, స్ట్రీట్ పైట్ కాదు

  • బయట ఎవరో ఏదో అంటే మేం సమాధానం చెప్పం.
  • కేసీఆర్‌కు ఓటేస్తే పదేండ్లు నట్టేట ముంచాడు.
  • రేవంత్‌కు ఓటేస్తే పది నెలలకే నిండా ముంచాడు.
  • మోదీ సహకారంతోనే రాష్ట్రాల అభివృద్ధి.
  • గాలి వార్తల గురించి నేను మాట్లాడను.
  • ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత దేశం.
  • బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్ట్రెయిట్ ఫైట్ తప్ప.. స్ట్రీట్ ఫైట్ చేయదని, నేరుగా ఫైట్ చేస్తుందని, కుట్రలు కుతంత్రాలు చేయదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎవరో బయటి వాళ్లు ఏదేదో మాట్లాడితే మమ్ముల్ని నిజమా అబద్ధమా అని అడగడం మంచిది కాదన్నారు. తెలంగాణ సమాజంలో వచ్చిన పెను మార్పు వచ్చిందన్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు.. కేసీఆర్‌కు ఓటు వేసిన ఖర్మానికి పదేళ్లలో నట్టేట ముంచాడని దుయ్యబట్టారు. పది నెలలకే రేవంత్ రెడ్డి సర్కారు నిండా ముంచిందని విమర్శించారు. ఇక బీజేపీకే ఓటు వేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారని అన్నారు. మోదీ సహకారంతో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఎలా దూసుకుపోతుందో చూస్తున్నారని అన్నారు. తెలంగాణ వెలవెల బోతుందని ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబి నుండి బయటపడి, అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ వాదులను కలవడంలో నేరమేమీ కాదని, అయితే కుటుంబీకుల ఫోన్లను ట్యాప్ చేయడం మాత్రం నేరమన్నారు. ఇలాంటి విద్యలన్నీ నేర్పింది కేసీఆర్ కాదా అని ఆయన ప్రశ్నించారు. నేతల మధ్య కంచెలను నాటింది కేసీఆర్ అని, దాన్ని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తనకు కేసీఆర్ ఎదురుపడితే సంస్కారంగా నమస్కరిస్తానని అన్నారు. బాధ్యతయుతమైన ఎంపీగా, మాజీ ఆర్ధిక శాఖ మంత్రిగా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హజరవుతానని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను బీజేపీలోకి తీసుకునే సమస్యే లేదన్నారు. మావోయిస్టుల అంశంపై కేసీఆర్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని, ఆపరేషన్ కగార్ అపాలని కేంద్రానికి లేఖ రాస్తానన్నారు రాశారా అని ఎంపీ ఈటల ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కూరా రాజన్నను కేసీఆర్ కలిశారని, తీరా అధికారంలోకి వచ్చాకా కూరా రాజన్నకు కేసీఆర్‌కు మధ్య పెద్ద గ్యాప్ వచ్చిందన్నారు.

  • ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత్ దేశం.

ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారత దేశమని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. ఈనాటికి హిమాలయాల్లో అనేక ఔషధ మొక్కలు మానవ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని అన్నారు.కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబేలెత్తి భయపడుతుంటే ధైర్యంగా ఉన్నది భారత దేశం మాత్రమేనని అన్నారు. మన ఇంట్లో ఉన్న పోపులు పెట్టే ఆయుర్వేద వైద్యాన్ని అందించి మన వ్యాధి నిరోధకతను కాపాడుతుందని అన్నారు. భారతదేశంలో ఇంత జనాభా ఉన్న ఇన్ని బస్తీలు ఉన్న కరోనాను తట్టుకోగలిగదానికి ఒక కారణం మన పోపుల పెట్టె అని అన్నారు.ఆయుర్వేదంలో క్యాన్సర్‌ను అరికట్ట లేకపోవచ్చు కానీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందన్నారు. ఈమధ్య తాను ఈశాన్య రాష్ట్రాలు సందర్శించానని, అక్కడ ఒక ఆసుపత్రిలో వనమూలికలతోనే అనేక జబ్బులకు చికిత్స చేస్తున్నారు ఎంపీ ఈటల తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.