- 15వేలు లంచం డిమాండ్ చేసి 10 వేలు తీసుకుంటూ.
- ఏసీబీకి పట్టుబడ్డ ఎస్సై అంతిరెడ్డి.
ముద్ర, చింతలపాలెం: సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం ఎస్సై అంతిరెడ్డి ఓ వ్యక్తి నుండి 10 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టు పడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకు చెందిన వర్ల వెంకట్రావు గతంలో చింతలపాలెం మండలంలో పిడిఎస్ బియ్యం కొనుగోలు చేస్తూ గతంలో పట్టుబడ్డాడు.అయితే కేసు ఫైనల్ కు రావడంతో ఆ కేసును కొట్టి వేయాలంటే ఎస్సై 15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీంతో వెంకట్రావు 10వేలు ఒప్పుకొని నల్లగొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలోని చర్చి దగ్గర 10వేలు నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్యాండెంట్ గా పట్టుకున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.