Take a fresh look at your lifestyle.

ఉత్తమ్ వన్నీ ఉట్టి మాటలే

  • పాత చింతకాయ పచ్చడిలా రాజకీయ ప్రసంగం.
  • కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఎల్లెంకల పడ్డారు.
  • మంత్రి సరిగ్గా ప్రిపేర్ కాకుండానే మీడియా సమావేశాన్ని నిర్వహించినట్లు ఉన్నారు.
  • కేవలం బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి  ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా కాంగ్రెస్ కు కనపడుతోంది.
  • ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్ సభలో వ్యతిరేకించింది  ఉత్తం కుమార్ రెడ్డి .
  • అప్పుడు రాంగ్ అయ్యింది, ఇప్పుడు రైట్ ఎట్ల అయ్యింది.
  • మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదు. 
  • అవినీతి జరిగినట్లు నివేదికలో లేకపోయినా…పేర్కొన్నట్లు చెప్పడానికి ఉత్తం కుమార్ రెడ్డి ప్రయాస, ఆపసోపాలు పడ్డారు.
  • ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ఎన్డీఎస్ఎ రిపోర్టుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినవన్నీ ఉత్తుత్తి మాటలేనని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.ఆయన చేప్పిన అంశాలు మీడియా ముందు పెట్టిన ప్రజెంటేషన్ కేవలం రాజకీయ ప్రసంగం మాదిరిగానే ఉందని విమర్శించారు.ఆ రిపోర్టును అడ్డం పెట్టుకొని,  పాత చింతకాయ పచ్చడి లాగా రాజకీయం ప్రసంగాన్ని కొనసాగించారని ధ్వజమత్తారు.ఈ రిపోర్టులో మంత్రి కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక ఎల్లెంకల పడ్డారని ఎద్దేవా చేశారు.మంగళవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ ఎన్డీఎస్ఎ నివేదికపై మంత్రి ఉత్తమ్ చేసిన ప్రకటనలు పూర్తిగా బీఆర్ఎస్ మీద విమర్శలు చేయడానికి అన్నట్లుగానే ఉన్నాయని విమర్శించారు.మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశంలో ఉనుక మీద రోకలోలె దుంకులాడుడే తప్ప, సంగతి లేదు, సబ్జెక్ట్ లేదు, సారం లేదని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఊక దంపుడు ప్రసంగంతో మంత్రి జర్నలిస్టుల సహనానికి పరీక్ష పెట్టారన్నారు.వాస్తవానికి ఎన్డీఎస్ఏ ఏర్పాటు బిల్లును కాంగ్రెస్ పక్షాన లోక్ సభలో లోవ్యతిరేకించింది ఉత్తం కుమార్ రెడ్డి అని అన్నారు. బహుషా మంత్రి అయిన తరువాత ఆ విషయాన్ని మరిచిపోయినట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అప్పుడు ’ఇట్స్ ఆన్ కానిస్టిట్యూషనల్ అండ్ ఎంక్రోచెమెంట్ అపాన్ స్టేట్ రైట్స్‘ అన్నారన్నారు. కేవలం గులాబీ పార్టీని తిట్టడానికే ప్రస్తుతం ఎన్డీఎస్ఏ రిపోర్టు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాగా కనపడుతున్నదన్నారు. అప్పుడు రాంగ్ అయ్యింది, ఇప్పుడు రైట్ ఎట్ల అయ్యిందని ప్రశ్నించారు. మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందని ఎన్డీఎస్ఏ ఎక్కడా చెప్పలేదన్నారు.అవినీతి జరిగినట్లు ఎన్డీఎస్ఏ పేర్కొనకున్నా, పేర్కొన్నట్లు చెప్పడానికి ఉత్తం కుమార్ రెడ్డి ప్రయాస, ఆపసోపాలు చూస్తే జాలి కలిగిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ కావడం కాంగ్రెస్ కు వణుకుపుడుతోందన్నారు.దీనిని డైవర్ట్ చేయడానికే భారత్ సమ్మిట్ అన్నారు. రైతు మహోత్సవాలు చేశారన్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోయిందన్నారు.కేసీఆర్ గర్జనకు కాంగ్రెస్ కకావికలం అయ్యిందన్నారు.అందుకే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టుతో కాంగ్రెస్ నేతలు వచ్చి లేనిపోని అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పోలవరం కడుతున్న ఎన్డీఎస్ఏ నే, డయాఫ్రం వాల్, గైడ్ వాల్ కుప్ప కూలిందన్నారు.ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ ఎందుకు విజిట్ చేయలేదని ప్రశ్నించారు.అన్ని ప్రాజెక్టులకు రూల్ ఒకే విధంగా ఉండాలన్నారు.నాలుగైదు ఏండ్లు అయినా పోలవరంకు ఎన్డీఎస్ఏ ఎందుకు పోదని నిలదీశారు ఎన్డీఎస్ఏ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సంస్థ లెక్క అని మంత్రి చెబుతున్నప్పటికీ దానిని ఈడీ, సీబీఐ లెక్క వాడుతున్నారని ఆరోపించారు.ఇది కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై చేస్తున్న పని అని విమర్శించారు.
ఎస్ఎల్బీసీ కంటే పెద్ద డిజాస్టర్ ఏముందని  హరీశ్ రావు ప్రశ్నించారు.
  • కాంగ్రెస్ దే నిర్లక్ష్యం.
తమ్మిడిహెట్టికి ఎందుకు అనుమతులు తేలేదని బీఆర్ఎస్ అను అడుగడం సిగ్గుచేటన్నారు. మహారాష్ట్ర, ఏపీ, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, ఎందుకు తమ్మిడిహెట్టికి అంతర్ రాష్ట్ర ఒప్పందం చేయలేదని ప్రశ్నించారు.ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కాదా? అని నిలదీశారు. మీరు పెట్టిన ఖర్చు వృథా అవుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వాన్ని హెచ్చరించారన్నారు.కమిషన్ల కోసం, పర్సంటీజీల కోసం టెండర్లు పిలిచి, ఎక్కడో చేవెళ్ల కాడ తవ్వారని మండిపడ్డారు.నీళ్లు తీసేకాడ తవ్వరు గానీ ఎక్కడో పోయి తవ్వుతారని మండిపడ్డారు.తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ అని దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం మంత్రి ఉత్తమ్ చేయడం సిగ్గుచేటన్నారు.వాస్తవానికి వైయస్ ప్రభుత్వం 2008లోనే  తుమ్మిడి హెట్టికి శంఖుస్థాపన చేశారన్నారు.అప్పుడే నాలుగేళ్ళలోనే ప్రాజెక్టు పూర్తి అవుతంది అన్నారని హరీశ్ రావు గుర్తు చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్  ఏడేండ్లు అధికారంలో ఉండి కనీసం అంతర్ రాస్ట్ర ఒప్పంద చేయలేదని విమర్శించారు. దీనిపై దమ్ముంటే ఉత్తమ్ సమాధాం చెప్పాలని డిమాండ్ చేశారు.
  • అవినీతికి పరాకాష్ట.
కాంగ్రెస్  హయంలో  ప్రాజెక్టుల పేరుతో ఇష్టాను సారంగా దోచుకున్నారని హరీశ్ రావు విమర్శించారు. సర్వే మొబిలేజేషన్ అడ్వాన్స్ పేరిట రూ. 1426 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.అలాగే మరో రూ. 160 కోట్ల ల్యాండ్ అక్వెజనీషన్ కోసం ఖర్చు చేశారన్నారు.ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట కాదా అని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లకు దోచిపెట్టారు, ఆ దోపిడిలో ఉత్తం కూడా ఉన్నారని ఆరోపించారు.నాటి నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు.ఈ తప్పును సరిచేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. అయినా సిగ్గులేకుండా  ఉత్తమ్ మాట్లాడడం తగదన్నారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ తో కేసీఆర్ చర్చలు జరిపారన్నారు.తాను స్వయంగా వెళ్లి ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ముషారఫ్ తో చర్చలు జరిపామన్నారు.ఎంత డబ్బు అయినా ఇస్తం,తమ్మిడిహెట్టి వద్ద అనుమతి ఇవ్వాలని అడిగామన్నారు.అంత ఎత్తుమీద ఒప్పుకోము అని స్పష్టంగా చెప్పారన్నారు.ఉత్తం చదువుకున్న వ్యక్తి మినిమం ఎథిక్స్ ఉంటాయి అనుకున్నానని అన్నారు. కానీ విజ్నానంతో కాడు, అజ్నాంతో మాట్లాడారని మండిపడ్డారు. అక్కడ నీళ్లు లేవు అని సిడబ్లుసీ చెప్పిందన్నారు.కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అనడంతో తుమ్మడి హెట్టి నుంచి వేరే చోటుకు తప్పని పరిస్థితిలో మార్చామన్నారు. నీళ్లు ఉన్న చోట్ల మేడిగడ్డ వద్దకు మార్చామని హరీశ్ రావు వివరించారు.కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ మేడిగడ్డ వద్ద కట్టాలని చెబితేనే కట్టామన్నారు. 220 టీఎంసీల నీళ్లు తీసుకునే అనుమతి సిడబ్లుసి నుంచి సాధించామన్నారు.
  • అవును కాస్ట్ పెరిగింది.
బీఆర్ఎస్ హయంలో తమ్మిడి హెట్టి ప్రాజెక్టు కాస్ట్ పెరిగిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కానీ 16 నుంచి 141 టిఎంసీలకు సామర్థ్యం పెంచామన్నారు. దీంతో కాస్ట్ పెరిగిందన్నారు. దీని ఫలితంగానే  ఆయకట్టు రెండింతలైందన్నారు. నీళ్లు తెచ్చే సామర్థ్యం 2 టిఎంసీలకు పెంచామన్నారు.సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని మార్చామన్నారు. మరి కాంగ్రెస్ హయంసలో 2007లో రూ. 17,800 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల కడుతాం అన్నారు కాదా మరి ఒక్క ఏడాదిలోనే రూ. 38,500 కోట్లకు ఎలా పెరిగిందని హరీశ్ రావు ప్రశ్నించారు.పైగా ఈ ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్ ను కేవలం నాలుగు నెలల్లోనే తయారు చేశామని  ఉత్తం అనడం సిగ్గుచేటన్నారు.కొడంగల్ నారాయణ్ పేట్ లిఫ్టుకు ఇప్పటి వరకు డిపిఆర్ ఉందా అని ప్రశ్నించారు.మరి టెండర్లు పిలిచి, ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా కడుతున్నదని నిలదీశారు.సమాచార హక్కు చట్టం కింద వచ్చిన సమాధానం ప్రకారం కొడంగల్ ప్రాజెక్టుకు ఇప్పటికీ డిపీఆర్ లేదన్నారు.అయినా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారన్నారు.కాంగ్రెస్ కో నీతి మాకో నీతి అని హరీశ్ రావు మండిపడ్డారు.నిజంగా బీఆర్ఎస్  ప్రభుత్వం తప్పు చేస్తే మాకు కేంద్ర ప్రభుత్వం ఎలా అప్పు ఇస్తుందన్నారు.అన్నారం, సుందిళ్ల లొకేషన్ తామే మార్చామన్నారు. అయితే అది జియలాజికల్ సర్వే ప్రకారంగానే మారిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెట్టిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థానం మారలేదా అని ప్రశ్నించారు.ఏలేశ్వరం నుంచి నంది కొండకు మారిది నిజం కాదా అని హరీశ్ నిలదీశారు.ఎస్సారెస్పీ ప్రాజెక్టు కుస్తాపురం నుంచి పోచంపాడుకు మారలేదా పరిస్థితులు, ముంపు, అవసరాలను బట్టి మారుతాయన్నారు.అది కూడా హైలెవెల్ కమిటీ నిర్ణయం మేరకు డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుదన్నారు.అన్ని రకాల టెస్టులు జరిగాకే, డిజైన్లు ఆధారంగానే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు.కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌజ్ లు, 16 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల టన్నెల్, 231 కిలో మీటర్ల గ్రావిటి కెనాల్ అని ఇవన్నీ బాగున్నాయన్నారు.కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ సహా నుంచి ఇప్పటికీ సాగు నీళ్లు వస్తున్నాయన్నారు.ఇవి కాళేశ్వరంలో భాగం కాదా, మరి లక్ష కోట్లు వృథా అయితే నీళ్లు ఎట్ల వస్తున్నాయని ప్రశ్నించారు..తొందరగా మేడిగడ్డను రిపేర్ చేస్తే నేడు ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదన్నారు.2014 దాకా ఎందుకు తుంగతుర్తి, కోదాడకు నీళ్లు రాలేదో ఉత్తం కుమార్ రెడ్డి చెప్పాలని సవాల్ చేశారు.మేడిగడ్డ ద్వార నీళ్లు తెచ్చి మిడ్ మానేర్ ద్వారా నీళ్లు తెచ్చామన్నారు.ఇకనైనా మంత్రి ఉత్తమ్ నిజాలు మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.రాజకీయాలు ఆరు నెలల ముందు చేయాలే తప్ప నిత్యం కాదన్నారు. ఇకనైనా  నిజాయితీగా పని చేయండి, అబద్దాలు, అసత్యాలు ఇంకెంత కాలం చెబుతారని ప్రశ్నించారు.ఆరు ప్రాజెక్టులు పూర్తి చేసి, ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తమని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఆరువేల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు.పెద్దవాగు తెగిపోయింది.ఎస్ఎల్బీసీ కుప్ప కూలిందన్నారు. అలాగే వట్టెం వాగు కొట్టుకుపోయిందన్నారు.
  • దీన స్ఖితిలో నీటి పారదల శాఖ.
తెలంగాణ నీటి పారుదల శాఖ ఎంత దీన స్థితిలో ఉందన్నారు. ఇందుకు 30 ఇఎన్సీ, సీఈ పోస్టుల్లో 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.57 సూపరింటెండ్ ఇంజినీర్ల పోస్టులకు గాను 40 ఖాళీ ఉన్నాయన్నారు.సెక్షన్ 3 నదీ జలాల మీద ట్రిబ్యునల్ లో వాదనలు జరుగుతుంటే, పూర్తి స్థాయి సీఈ, ఎస్ ఇ లేడని ధ్వజమెత్తారు.కేవలం డిప్యూటీ ఇఇ, మాత్రమే హాజరవుతున్నారన్నారు.చివరికి వారికి  విమాన చార్జీలు కూడా ఇవ్వడం లేదన్నారు.ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలని హరీశ్ రావు  డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.