Take a fresh look at your lifestyle.

స్వచ్ఛ ఇందనం వాడదాం – భూమిని కాపాడదాం: లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ పిలుపు

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యావరణ సేవా వారంలో భాగంగా శనివారం ఇందన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ మాజీ గవర్నర్ రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ మెంబర్‌షిప్ కోఆర్డినేటర్ హకీమ్ విశ్వప్రసాద్‌తో కలిసి అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛమైన ఇందనాల వినియోగం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి, భూమిని రక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, కార్యదర్శి సురేష్ కుమార్, కాబినెట్ సభ్యుడు తెప్ప శ్రీను, మాజీ అధ్యక్షులు పోల శ్రీనివాసులు, రాంచంద్రా రెడ్డి, ప్రేమ్ కుమార్ రెడ్డి, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.