గొల్లపల్లి, ముద్ర విలేకరి : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలంలోని ఏళ్ల తరబడి రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి రాష్ట్ర ప్రభుత్వం కార్డులను మంజూరు చేసింది.కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్ లైన్ దరఖాస్తు చేసుకున్నవారికి అన్నిరకాల పరిశీలన పూర్తయ్యాక కార్డులు జారీ చేసిన్నారు. రేషన్ కార్డులు మంజూరు అయిన వారికి మూడు నెలల తర్వాతే బియ్యం అందజేయడం జరుగుతుందాని. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన బియ్యాన్ని జూన్ లోనే ఒకే సారి పంపిణీ చేస్తుంది. మే 20వ తర్వాత కార్డులు పొందిన వారికి సెప్టెంబర్ లొనే సన్నబియ్యం పంపిణీ. చేయడం జరుగుతుందాని గతంలో ఉన్న కార్డులతో పాటు మే 20కి కంటే ముందు కార్డులు పొందిన వారికి, కోటా ప్రకారం ప్రభుత్వం బియ్యం విడుదల చేసిందాని. కానీ ఆ తర్వాత కార్డులు పొందిన వారికి కోటా ఇవ్వకపోవడంతో వారంతా మూడు నెలలపాటు ఆగాల్సిందేనాని,అధికారులు తెలిపారు.
