Take a fresh look at your lifestyle.

పారదర్శకమైన ఓటరు జాబితా కోసమే ఎస్.ఐ.ఆర్ రాజకీయ పార్టీలు సహకరించాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

 

ముద్ర కరీంనగర్: మార్చి 24

ఓటరు జాబితా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక సమగ్ర సవరణ(SIR)ను ఎన్నికల సంఘం చేపట్టిందని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇందుకు పూర్తిగా సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.
(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అవగాహన సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంలో బూత్ లెవెల్ అధికారులతో పాటు రాజకీయ పార్టీలు నియమించుకునే బి.ఎల్.ఎల పాత్ర కూడా కీలకమని అన్నారు. 1951 నుండి ఇప్పటివరకు 8 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని చివరగా 2002 నుండి 2004 వరకు నిర్వహించారని తెలిపారు. ప్రత్యేక సమరణ ద్వారా జాబితాలో నిజమైన ఓటరు కచ్చితంగా ఉంటారని తెలిపారు. డూబ్లికేట్ ఓటర్లతో పాటు మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిపోయిన, రెండు ఓట్లు ఉన్నవాళ్ల ఓట్లు మాత్రమే తొలగిస్తారని తెలిపారు. ఎవరూ అపోహకు గురి కావద్దని సూచించారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను తప్పక నియమించుకోవాలని సూచించారు. ప్రత్యేక సమగ్ర సవరణ తరువాత ఓటు హక్కు రానివారు ఉంటే ఆక్షేపణ చేయవచ్చని తెలిపారు.


ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డిఓ రమేష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.రమణారెడ్డి (బిజెపి), అబ్దుల్లా అసీం, సయ్యద్ బర్కత్ అలీ, సయ్యద్ (ఏఐఎంఐఎం), సాతినేని శ్రీనివాస్ (బిఆర్ఎస్), ఈ.రవీందర్ (టిడిపి), నాంపల్లి శ్రీనివాస్ (బిజెపి) ఎం.వాసుదేవరెడ్డి (సిపిఐ(ఎం)), రామిడి తిరుపతిరెడ్డి వి.నర్సింగం(ఐ.ఎన్.సి) పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.