ముద్ర,హైదరాబాద్:
హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రసిద్ధ ఫోటో జర్నలిస్ట్ రఘు రాయ్ సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ డి. సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కె. రాములు, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. సత్యనారాయణ పాల్గొన్నారు.
అలాగే ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి కె.ఎన్. హరి, సీనియర్ ఫోటో జర్నలిస్ట్ రవీందర్ రెడ్డితో పాటు పలువురు ఫోటో జర్నలిస్టులు హాజరై రఘు రాయ్ సేవలను స్మరించుకున్నారు. ఫోటో జర్నలిజం రంగంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు.