Take a fresh look at your lifestyle.

అవగాహనతోనే క్షయ వ్యాధి నిర్మూలన

 

ముద్ర, గద్వాల:

క్షయ వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే పూర్తిస్థాయిలో నిర్మూలించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు అన్నారు.

ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం డీఎంహెచ్ఓ డాక్టర్ జె.సంధ్య‌ కిరణ్మయి ఆధ్వర్యంలో టిబీ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జి.రాజు సమక్షంలో టీబీ ముక్త్ భారత్ అభియామ్ సెకండ్ ఫేస్ 2.0 కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు గద్వాలలోని ఎంసీహెచ్ సెంటర్లో ప్రారంభించారు. ముందుగా పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ జె.సంధ్య కిరణ్మయి మాట్లాడుతూ..‌టీబీ రహిత రాష్ట్రంగా మార్చడమే ఈ కార్యక్రమ లక్ష్వం అన్నారు. సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ప్రతినెల ఆర్థికసాయం చేస్తోందన్నారు .

ఈ కార్యక్రమంలో డాక్టర్ అభినేష్, డాక్టర్ శరత్ , డాక్టర్ హర్ష, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక, వైద్య సిబ్బంది కే.మధుసూదన్ రెడ్డి,వరలక్ష్మి,శ్యాంసుందర్, శివన్న ,అర్బన్ సూపర్వైజర్లు, టిబి ప్రోగ్రాం కోఆర్డినేటర్ సాదిక్, గురు బసయ్య, విజయి, కిరన్, అనిల్, వెంకటేష్,
ఏ.ఎన్.ఎంలు మరియు ఆశలు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.