Take a fresh look at your lifestyle.

కొత్తగా ఏర్పడిన పట్టణాలనూ పీఎంఏవై పరిధిలో తీసుకురావాలి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

 

న్యూఢిల్లీ :

కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలను కూడా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పరిధిలోకి తీసుకురావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ హౌసింగ్, పట్టణ వ్యవహారాల స్థాయి కమిటీ సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పట్టణ స్థానిక సంస్థలలో ఆదాయ సమీకరణ, బడ్జెట్ నిర్వహణపై జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫున మాట్లాడిన ఎంపీ చామల, కొత్త యూఎల్బీలను పీఎంఏవైలో చేర్చడం ద్వారా మెప్మా-పీఎంఏవై (యూ) 2.0 పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయవచ్చని వివరించారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలోకి 27 పరిసర పట్టణ స్థానిక సంస్థలను విలీనం చేస్తున్న విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లిన ఆయన, జీహెచ్ఎంసీ విస్తృత పరిధిలోకి వచ్చిన ఈ యూఎల్బీలలో కూడా పీఎంఏవై అమలుకు అవకాశం కల్పించాలని సూచించారు. దీని ద్వారా పట్టణ పేదలకు గృహ పథకాలు మరింత విస్తృతంగా, సమర్థవంతంగా అమలవుతాయని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.