ముద్ర, భువనగిరి ప్రతినిధి :
భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తంగెళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు, 19 వ వార్డు కౌన్సిలర్ బండారు స్వర్ణలత, 20 వ వార్డు కౌన్సిలర్ పచ్చా ల జగన్మోహన్ లను ఆదివారం పట్టణ కుమ్మరి సంఘం అధ్యక్షులు చిన్నగారి బాలరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కుమ్మరి సంఘం నాయకులు పాల్గొన్నారు.