Take a fresh look at your lifestyle.

రైతులకు ఆధునిక వ్యవసాయంపై శిక్షణ భూసారం కాపాడేందుకు శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలి సూర్యాపేట జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత

 

ముద్ర ప్రతినిధి , కోదాడ ….

కోదాడ మండలంలోని అల్వాలపురం రైతు వేదికలో డివిజన్ మరియు మండల స్థాయి వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) పథకం ఆధ్వ ర్యంలో రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ (ఆర్.పి.ఎల్) శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో జిల్లా ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ రైతులకు రసాయనిక ఎరువులను అధికంగా వినియోగిం చడం వల్ల భూసారం క్షీణిస్తుందని తెలిపారు. రైతులు శాస్త్రవే త్తలు సూచించిన విధంగా దఫాల వారీగా ఎరువులు వినియోగించాలని సూచించారు.

భూమిలో సేంద్రియ కర్బనం పెంచేందుకు ప్రధాన పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారం మెరుగుపడు తుందని వివరించారు. కృషి విజ్ఞాన కేంద్రం గడ్డిపల్లి శాస్రవేత మాట్లాడుతూ యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డి.ఏ.పీ ఎరువులను వినియోగించడం ద్వారా మొక్కలకు అవసరమైన నత్రజని నేరుగా పత్రాల ద్వారా అందుతుందని తెలిపారు. దీని వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా భూమిలో నత్రజని నష్టం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు. వరి పంటలో ప్రాచుర్యంలో ఉన్న రకాల గురించి , తెగుళ్లు పురుగుల గురించి వివరిం చారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ వరి పంటలో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. మండల వ్యవసాయ అధికారి పాలెం రజని మాట్లాడుతూ వ్యవసాయశాఖ అమలు చేస్తున్న పథకాలపై రైతులకు వివరించారు. మరియు పశు సంవర్ధక శాఖ డాక్టర్ మాట్లాడుతూ పశుగ్రాసం పెంపకం, పాడిపశువుల అభివృధి పథకాలు తెలియ పరిచారు. ఈ కార్యక్ర మంలో కోదాడ నియోజకవర్గ ఆత్మ చైర్మన్ బుడిగo లింగయ్య, ఆత్మ డైరెక్టర్లు , కోదాడ సాంకేతిక వ్యవసాయ అధికారి దేవప్రసాద్, కోరమండల్ సంస్థ అధికారులు వ్యవసాయ విస్తరణ అధికారులు నగేశ్ , ఝాన్సీ , వినోద్, అన్వేష్ మరియు సల్మా, రైతులు తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.