Take a fresh look at your lifestyle.

విద్యార్థిని పట్ల అవమానకారంగా మాట్లాడిన గురుకుల నర్సు కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది.. మనస్విని అనే విద్యార్థి పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. విద్యార్థిని తల్లిదండ్రులు నల్లగా ఉన్నారు. జంగిల్ నుంచి పట్టుకొచ్చారు.. లేబర్ పని చేసే వాళ్ళు ఇలాంటి తల్లిదండ్రుల పిల్లలకు టీసి ఇచ్చి పాఠశాల నుంచి పంపించేయాలని అవమానకర వ్యాఖ్యలు చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాలలో పని చేసే నర్సు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో విద్యార్థిని తల్లిదండ్రులు కలెక్టర్ ప్రతిమ సింగ్ కు ఫిర్యాదు అందజేసిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. గత నెల 20న కిడ్నీ స్టోన్ సమస్యతో విద్యార్థిని మనస్విని బాధపడగా తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో తమ కూతురిని వైద్యం చేయించి ఇంటికి తీసుకెళ్లారు. నొప్పి తగ్గిన వారం రోజుల తర్వాత కూతురిని తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకెళ్లగా పాఠశాలలో పనిచేసే నర్సు ఆశాజ్యోతి, ఇతర సిబ్బంది విద్యార్థిని భయభ్రాంతులకు గురిచేస్తూన్నారని విద్యార్థిని మనస్విని తెలిపింది. ఇంకా మూడు సంవత్సరాలు పాఠశాలలోనే చదవాలి, ఎలా చదువుతావో చూస్తామని భయపెట్టిస్తున్నారని విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా అనారోగ్యానికి గురై వాంతులు చేసుకున్న సందర్భంలో కూడా తన పట్ల నర్సు ఆశాజ్యోతి దురుసుగా ప్రవర్తించారని విద్యార్ధిని బోరున విలపించింది. తనతోపాటు చదువుకునే విద్యార్థుల ముందు పాఠశాలలో పనిచేసే నర్సు ఆశాజ్యోతి తన తల్లిదండ్రులను కూడా కించపరిచేలా అవమానకర వ్యాఖ్యలు చేసిందని తెలిపింది.
ఈనెల 6న విద్యార్థిని ఆమె తల్లిదండ్రులు పాఠశాలకు తీసుకెళ్లగా కిడ్నీ స్టోన్ పూర్తిగా తగ్గిన తర్వాతనే పాఠశాలకు రావాలని పాఠశాల ప్రిన్సిపల్ చెప్పడంతో ఇంటికి వెళ్లారు. తమ కూతురూను పాఠశాలలో చేర్పించుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ కు గోడు చెప్పుకున్నారు. ప్రిన్సిపాల్ తో మట్లాడతానని కలెక్టర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.