ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన వారికి శుక్రవారం క్యాపింగ్ సెర్మని నిర్వహించారు.
గాంధీ ఆసుపత్రి నుండి సలెహ రహీం, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి నుండి నాగవేణి డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన సందర్భంగా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని నర్సింగ్ సూపరింటెండెంట్లు మంజుల, పేర్సీ సుమన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పదోన్నతి పొందిన నర్సులను శాలువలు కప్పి, పూలమాలతో సత్కరించారు. నర్సింగ్ సూపరింటెండెంట్ మంజుల మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతులు కల్పించడం శుభపరిణామమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు పద్మ, సునీత, శ్వేతతో పాటు నర్సింగ్ ఆఫీసర్లు ఎం. ఆనంద్, సరస్వతి, అనురాధ, పుష్పలత, కవిత, జ్యోతి, నిర్మల, నీలిమ, స్వప్న, అరుణ, రమా తదితరులు పాల్గొన్నారు.