Take a fresh look at your lifestyle.

డా. పి. చంద్రశేఖర్ కు గ్లోబల్ లీడర్షిప్ అవార్డు

 
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు – 2026 అందుకున్నారు.
ఆయన చేసిన విశిష్ట సేవలకు లభించిన గొప్ప గుర్తింపుగా పేర్కొన్నారు. జనరల్ సర్జన్‌గా ఎన్నో ప్రాణాలను కాపాడుతూ, రోగులకు నూతన జీవం ప్రసాదించిన సేవలు నిజంగా ఎనలేనివి. వైద్య వృత్తిని ఉద్యోగంగా కాకుండా, ఒక సేవా ధర్మంగా భావించి అంకితభావంతో చేసిన సేవకు గుర్తుంచి అవార్డు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ పిప్పిరి చంద్రశేఖర్
లయన్స్ క్లబ్ వంటి సేవా సంస్థల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సామాజిక కార్యక్రమాల్లో ముందుండి నడుస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలను నడుపుతూ పేదల సంక్షేమం, ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధి వంటి అనేక రంగాల్లో తన వంతు సేవలను అందిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.