- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.
- పల్లె దవాఖాన, అధునపు తరగతి గది నిర్మాణానికి శంకుస్థాపన.
- విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణి.
కోరుట్ల/కథలాపూర్, ముద్ర: ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.మంగళవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో పల్లెదవఖాన, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి, గంభీర్పూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ బాల స్వాస్త్య కార్యక్రమం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు కంటి అద్దాలను పంపిణి చేశారు.విప్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పెద విద్యార్థికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్రంలో ఇప్పటికే 55 ఇంటిగ్రేటెడ్ నిర్మాణం కోసం 2 వందల కొట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సి, ఎస్టీ, బీసీ విద్యార్థులకు సైతం ఇంటర్నేషనల్ స్థాయిలో విద్య అందిస్తున్నామన్నారు.గత పదేళ్లుగా నిర్లక్ష్యంగా మారిన విద్యలో మార్పు తీసుకువచ్చి,పెద విద్యార్థులకు మంచి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగి తల్లిదండ్రుల ఆశాయలను నెరవేర్చాలన్నారు.విద్య వైద్యం ఆరోగ్యపరంగా పేద ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు.అందులో భాగంగా నూతనంగా పల్లె దవఖాన నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందన్నారు.పాఠశాలల్లో విద్యార్థుల యోగ క్షేమాలు చూసుకొనే బాధ్యత ప్రభుత్వానిదని,రానున్న పదవ తరగతి పరీక్షలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.అలాగే రాళ్లవాగు ప్రాజెక్టు ద్వారా కథలాపూర్ మండల రైతాంగానికి సాగునీరు అందించడానికి చెడిపోయిన కాలువల నిర్మాణం కొనసాగుతుందని పేర్కొన్నారు.
- అదునపు తరగతి గది, బాత్రూంలో నిర్మాణానికి హామీ
తాండ్రియాల మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు టాయిలెట్ సౌకర్యాలు, అదనపు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తాండ్రియాలలో ఐదు లక్షలతో టాయిలెట్ల నిర్మాణం, 15 లక్షలతో అదనపు తరగతి గది,గంభీర్ పూర్ ఒక బ్లాక్ టాయిలెట్స్, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. వీలైనంత త్వరగా నిర్మాణం చేసి వినియోగంలోకి తేవాలని సూచించారు.
- పలు దేవాలయాలు సందర్శన
కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, తక్కలపల్లి గ్రామంలో ఆండాల్ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు.
