Take a fresh look at your lifestyle.

జవహర్ జానపహాడ్ లిఫ్ట్ గా ఎత్తిపోతల ప్రాజెక్ట్ కి నామకరణం చేసిన మంత్రి ఉత్తమ్

  • మండల వ్యాప్తంగా 5650 ఎకరాలకు అందనున్న సాగునీరు
  • 6 నెలల్లో పనులు పూర్తి మండలం సస్యశ్యామలం
  • సమిక్షసమవేశంలో మంత్రి
  • రేషన్ కార్డు అరుహాలందరికి అందేవరకు నిరంతర ప్రక్రియ
  • త్వరలోనే ఉచిత సన్నబియ్యం పంపిణీ
  • 40 లక్షల మందికి కొత్త రేషన్ కార్డుల ఇస్తామని స్పష్టం
  • పాత రేషన్ కార్డులను తొలగిస్తాం అనేది అవాస్తవం..మంత్రి

పాలకీడు, ముద్ర :- మండలంలోని గుండెబోయినగూడెం గ్రామ శివారులో కృష్ణా నది పై నిర్మిస్తున్న ఎత్తిపోతల ప్రాజెక్టు కు రాష్ట్ర బారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జవహార్ జానపహాడ్ లిఫ్ట్ గా నామకరణం చేశారు.173 కోట్ల రూపాయల తో నిర్మిస్తున్న ఈ బారీ ప్రాజెక్టు ద్వారా మండల వ్యాప్తంగా 5650 ఎకరాలకు సాగు నీరు అందనుంది అని మంత్రి స్పష్టం చేశారు. 6 నెలల్లో పనులు పూర్తి చేసి మండలాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. జానపహాడ్, కోమటికుంట, చెరువుతండ, బోత్తలపాలెం,ఆలింగాపురం, రాఘవాపురం, మీగడంపాడ్ తండా,గుండ్లపహాడ్ గుండెబోయినగూడెం గ్రామాల రైతులకు సాగు నీరు అందుంతుందని తెలిపారు.

లిఫ్ట్ పనులను సంబంధిత అధికారులతో పరిశీలించారు .ఈ నెల 24 న జరగనున్న జానపహాడ్ దర్గా ఉత్సవాలా గురించి తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుళ్ళ హుస్సేన్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలల్ పవార్ తో సమీక్ష నిర్వహించారు. భక్తులకు అన్ని శాశ్వత ఏర్పాట్లు చేయాలనీ సుచచించారు, దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . 26 నుండి ప్రారంభం కానున్న సంక్షేమ పదకాల అమలు గురించి మంత్రి మాట్లాడుతూ అర్హులందరికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. దాదాపు 40 లక్షల కార్డులు ఇస్తామని స్పష్టం చేసారు. గత ప్రభుత్వం దొడ్డు బియ్యం పంపిణి చేసి వ్యాపారం చేసిందన్న మంత్రి త్వరలోనే నాణ్యమైన సన్నబియ్యం ఉచింతంగా అందిస్తమాని హామీ ఇచ్చారు.

కుల గణన సర్వే, ప్రజాపాలన కార్యక్రమాలలో ఇచ్చిన దరఖాస్తుల ఆధారంగా అరుహుల ఎంపిక ఉంటుందన్నారు. జాబితాలో పేరు రాని వారు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకువాచ్చు స్పష్టం చేసారు.పాత రేషన్ప్ర కార్డులు తీసేస్తామన్న ప్రతిపక్ష పార్టీ నాయకుల మాటలు నమ్మొద్దని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. సంవత్సర కాలంలోలోనే పాలకీడు మండలనికి 200 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపాల్ నాయక్, మాజీ జడ్పీటీసీ మోతిలాల్, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారావు,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మ రెడ్డి,నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్, వక్ఫ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అలీ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.