Take a fresh look at your lifestyle.

ధర్మస్థల్ సుందరీకరణ పనుల పునః ప్రారంభించాలని కమిషనర్ కు వినతి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో గడియారం వద్ద ఉన్న ధర్మస్థల్ సుందరీకరణ పనులను పునః ప్రారంభించాలని విశ్వహిందూ పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో మంగళ వారం మున్సిపల్ కమిషనర్ కు మెమోరండం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడతూ గతంలో ఈ ధర్మస్థల సుందరీకరణ కోసం మున్సిపల్ లో టెండర్ ఎంసీఆర్ 687 ప్రకారం పనులు ప్రారంభించి తరువాత ఎన్నికల కోడ్ అని చెప్పి పనులు ఆపారని కోడ్ ముగిసినందున మళ్లీ ఇప్పుడు పునః ప్రారంభం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో విహెచ్ పీ జిల్లా అధ్యక్షుడు బోయినీ పద్మాకర్, నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, జిల్లా సహ కార్యదర్శి గాజోజు సంతోష్, నగర కార్యదర్శి ఎదురుగట్ల పరంధాము పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.