Take a fresh look at your lifestyle.

తాండూర్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపాలిటీ అంచనా బడ్జెట్ కు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో చైర్ పర్సన్ శ్రీమతి పట్లోళ్ల నీరజ అధ్యక్షతన ప్రత్యేక బడ్జెట్ సమావేశం నిర్వహించారు 2026-2027 ఆర్థిక సంవత్సరం సవరణ అంచనా సాధారణ ఆదాయం రూ. 2751.44 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రూ. 10.29 లక్షల ప్రారంభ నిల్వ తో ఈ బడ్జెట్ ని ఆమోదం తెలిపారు. 2026-2027 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్నుపై రూ. 10.లక్షలు, స్టాంపు డ్యూటీ కింద రూ. కోటి, తై బజార్ కింద రూ. 5 లక్షలు, మున్సిపల్ దుకాణాల ద్వారారూ. 50 లక్షలు, ట్రేడ్ లైసెన్స్ స్పీచ్ ద్వారా రూ. 50 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. పట్టణ ప్రణాళిక ద్వారా లేఅవుట్ ఫీజులు, బిల్డింగ్ క్రమబద్దీకరణ రుసుము రూ. రూ. 2 కోట్ల 11 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఈ ఆర్థిక సంవత్సరం అంచనా సాధారణ వ్యయం రూ. 2782.64 లక్షలకు కౌన్సిల్ ఆమోదం తెలిపారు.

ఆదాయం పెంపునకు కృషి చేద్దాం : చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ

తాండూర్ మున్సిపాలిటీలో ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి కౌన్సిలర్ సహకరించాలని, అందరం కలిసి ఆదాయాన్ని పెంచుకుని, ప్రజా సమస్యల పరిష్కరించుకుందామని మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ కోరారు. బడ్జెట్ సమావేశం అనంతరం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ గ్రాంట్స్ తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నిధులను కూడా తెచ్చుకుని అభివృద్ధి చేసుకుందామన్నారు. మున్సిపల్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగిన కౌన్సిలర్లకు తప్పనిసరి సమాచారం అందించాలని ఆమె అధికారులను ఆదేశించారు. కుక్కల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ కు లేఖ రాస్తున్నట్లు ఆమె సభ్యులకు వివరించారు. శివారు ప్రాంతానికి కూడా మిషన్ భగీరథ తాగునీటి వ్యవస్థను తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టు అలాగే పట్టణంలోని పార్కు స్థలాలను గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకొని ఉన్నట్లు ఆమె వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ అబ్దుల్ రజాక్, వివిధ పార్టీల మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.