- మాజీ ఎమ్మెల్సి జీవన్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల : దేశంలో ఎక్కడ లేని విధంగా నిరుపేదలు కూడా సన్న బియ్యం తినాలనేది ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జన్మదిన వేడుకలు యువజన కాంగ్రెస్ ఎస్సీ సెల్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థ నిరుపేద వర్గాలకు నిత్యావసర వస్తువులు ప్రభుత్వపరంగా పంపిణీ కార్యక్రమం దేశంలో సన్న బియ్యం పంపిణీ చేయాలని అందరికీ ఉన్నది కానీ సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అన్నారు. ప్రజా వినియోగానికి సంబంధించి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కాకుండా మధ్య దళారీ వ్యవస్థను అరికట్టే విధంగా, సన్న రకం బియ్యాన్ని పంపిణీ చేయాలని ఆలోచన ఈ రోజు రూపకల్పన చేసింది కాదు ఆరు మాసాల క్రితమే చేసిందన్నారు. ఏప్రిల్ 1 వ తేదీ 2025 నాడు రాష్ట్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చౌక ధర దుకాణలలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయడం అది మిత్రులు లక్ష్మణ్ కుమార్ జన్మదినం కావడం విశేషం అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, ప్రజలకు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, సుభాష్ యాదవ్,మాజీ ఎంపీపీ రమేష్ బాబు, స్వామి రెడ్డి, గుండ మధు, రఘువీర్ గౌడ్, బొల్లి శేఖర్, జగదీశ్వర్, నర్సన్న, విజయ్, తోపారపు రజనీకాంత్, బడుగు రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.