Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు

  • ఇచ్చిన హామీలు నెరవేర్చ లేదని మాజీ ఎమ్మెల్యే హరి ప్రియ కంప్లైంట్

ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానొత్ హరి ప్రియ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.పార్టీ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్ తో కలసి ఇల్లెందులోని తెలంగాణ తల్లి చౌరస్తా నుండి ప్రదర్శనగా వెళ్ళి ఈ మేరకు పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుటి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి, తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమ సీనియర్ నాయకులు సిలివెరి సత్యనారాయణ, లకావత్ దేవిలాల్ నాయక్, ఇల్లందు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్ రావు, ఇల్లందు మండలం అధ్యక్షుడు శీలం రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఇల్లెందు మాజీ కౌన్సిలర్ జెకే శ్రీను, ఇల్లందు మండలం ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర భావసింగ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ దాసం ప్రమోద్, ఇల్లందు పట్టణ మహిళా అధ్యక్షురాలు నెమలి లక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొక్కు సరిత, ఇల్లందు పట్టణ ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబీ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.