Take a fresh look at your lifestyle.

పాఠశాలను తనిఖీ చేసిన ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం.

ముద్ర,మోత్కూర్:
ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, మౌలిక సదుపాయాలను అంచనా వేయడానికి ప్రభుత్వము ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందము గురువారం మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో గాంధీనగర్, పద్మశాలి కాలనీ, కాశవారి గూడెం , ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నోడల్ బృంద సభ్యులు వనం వెంకటేశ్వర్లు సత్తిరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు పాఠశాలల పనితీరుపై ప్యానల్ ఇన్స్పెక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు , పాఠశాల పరిసరాల పరిశుభ్రత, క్రీడలు, లైబ్రరీ నిర్వహణ, ఉపాధ్యాయుల డైరీలు, లెసన్ ప్లాన్స్, ఎఫ్ ఎల్ ఎన్, ఎఫ్ ఎల్ ఎస్ ,ఉపాధ్యాయుల హాజరు, స్టాక్ రిజిస్టర్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అలైన్మెంట్ పాటించాలని ఉపాధ్యాయ సమీక్ష సమావేశం లు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బృందం సభ్యులు వనం వెంకటేశ్వర్లు, సత్తిరెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్లు , పుష్పలత, పరమేశ్వరి, నర్సయ్య, సుధాకర్ ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.