Take a fresh look at your lifestyle.

గిగ్ వర్కర్లకు ప్రత్యేక బోర్డు

  • మంత్రివర్గం ఆమోదం తర్వాత అసెంబ్లీలో బిల్లు.
  • రాష్ట్రవ్యాప్తంగా  4.5 లక్షల మంది గిగ్ వర్కర్లకు లబ్ధి.
  • రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్.

ముద్ర, తెలంగాణ బ్యూరో : త్వరలోనే గిగ్ వర్కర్లకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర  కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిగ్ వర్కర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త చట్టం తేస్తామని చెప్పారు.వారి కోపం కొత్త చట్టాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నామని అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.మంత్రివర్గంలో ఆమోదం పొందాక అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెడతామని అన్నారు.దీంతో తెలంగాణ వ్యాప్తంగా కొత్త చట్టంతో మొత్తం 4.5 లక్షల మంది గిగ్ వర్కర్లు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. కొత్త చట్టంలో భాగంగా 2 శాతం సెస్ వినియోగదారులు, కంపెనీ యాజమాన్యం భరించాలనే ప్రతిపాదనను బిల్లును పొందుపరుస్తామని మంత్రి వివేక్ అన్నారు. రాజస్థాన్,  కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని గుర్తు చేశారు.త్వరలో తెలంగాణలోనూ అదే చేయబోతున్నాయని స్పష్టం చేశారు.గిగ్ వర్కర్ల హక్కుల అమలు కోసం ఇప్పటి వరకు 66 సలహాలు, సూచనలు వచ్చాయని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వం తొలి అడుగు వేయబోతోందని చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.