Take a fresh look at your lifestyle.

350 కోట్ల నిధులతో జగిత్యాలలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ

  • జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో రూ. 350 కోట్ల పైగా నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసేందుకు ఎస్ కే కన్సల్టెన్సీ ఆద్వర్యం లో సర్వే పూర్తి చేయించి అధికారులతో డిపీఆర్ సిద్ధం చేయటం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పేర్కొన్నారు. మోతే రోడ్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ సిద్ధం చేసిన డిపీఆర్ ను ప్రదర్శించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం జగిత్యాల పట్టణం అభివృద్ధి చెందుతుందని, రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామని, మాస్టర్ ప్లాన్ ద్వారా రైతులకు ఎలాంటి నష్టం కలగదని అన్నారు. అమృత్ స్కీమ్ లో 3 ఏండ్లలో ప్రతి ఇంటికి త్రాగు నీరు, యుఐడిఎఫ్ ప్రకారం 1 లక్ష జనాభా ఉన్న పట్టణానికి కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం తో అమృత్ స్కీమ్ అమలు చేస్తూ నిధులు కూడా మంజూరు అయ్యాయి అన్నారు. జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తాన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం నలువైపుల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, కాంక్రీట్ జంగల్ గా మారిన జగిత్యాలను పరిసర గ్రామాలను సైతం కలిపి అభివృధి విస్తరణ కు కృషి చేశాన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం అభివృద్ధి చేయటం నా బాధ్యత అని, రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్ట్ 4520 డబల్ బెడ్ రూమ్ ఇందిరమ్మ కాలని అన్నారు.మల్యాల మండలం నూకపల్లి,నర్సింగాపూర్ 188 ఎకరాలను జగిత్యాల మున్సిపల్ లో కలపడం కోసం క్యాబినెట్, అసెంబ్లీ లో తీర్మానం చేయటం జరిగింది, గవర్నర్ ఆమోదం మాత్రమే మిగిలి ఉందన్నారు.కేంద్ర పట్టణ,గృహ నిర్మాణ అభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ను గతంలో కలిసి అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని వినతిపత్రాన్ని అందజేటం జరిగిందని తెలిపారు. అనంతరం జగిత్యాల పట్టణ 4వ వార్డ్ లో రూ. 57.50 లక్షలతో జగిత్యాల పట్టణంలో అన్ని వార్డులలో నూతనంగా ఏర్పాటు చేయనున్న కరెంటు స్తంభాల ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు అడువల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, క్యాదసు నాగయ్య, పద్మావతి పవన్, మల్లవ్వ తిరుమలయ్య, కుసరి అనిల్, కొలగనిసత్యం, శ్రీనివాస్, దుమాల రాజ్ కుమార్,శరత్ రావు, కోటేశ్వర రావు,శ్రీరామ్ భిక్షపతి, మున్సిపల్ కమిషనర్ స్పందన, ఎడిఇ జవహర్ నాయక్, కలీం, ఎఇలు సతీష్, సంతోష్, ప్రవీణ్, ఎల్ . ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.