Take a fresh look at your lifestyle.

హెచ్ సీయూలో పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలి

  • బీఆర్ఎస్వై నియోజకవర్గ అధ్యక్షులు జేర్కొని రాజు.
  • ఆందోళనల నేపద్యంలో బీఆర్ఎస్వి నేతల ముందస్తు అరెస్టు.

ముద్ర, ఇబ్రహీంపట్నం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూముల్లో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఆపాలని బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు జెర్కోని రాజు డిమాండ్ చేశారు.హెచ్ సీయూ భూముల విక్రయానికి వ్యతిరేకంగా యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనలకు పిలుపునివ్వగా వారికి మద్దతుగా వెళ్తారన్న సమాచారంతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్, మున్సిపల్ అధ్యక్షులు శివసాయిలతో కలిసి జేర్కొని రాజు మాట్లాడుతూ అన్యాయాన్ని ప్రశ్నించే హక్కు లేకుండా ప్రభుత్వం ముందస్తు అరెస్టులు చేయడం దారుణం అన్నారు.400 ఎకరాల భూములను తెగనమ్మి వచ్చిన డబ్బులతో పరిపాలన చేయాలని చూస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే వన్యప్రాణుల రక్షణ, విద్యార్థుల ప్రతిఘటనను పరిగణనలోకి తీసుకొని హెచ్సీయూ భూముల్లో విధ్వంసాన్ని ఆపాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.అరెస్టయిన వారిలో బీఆర్ఎస్వీ నాయకులు కరుణాకర్, కొండ్రు మహేష్, యాచారం సురేష్ లు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.