Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం: ఆరుగురి రక్షణ, ముగ్గురు నిర్వాహకుల అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి :

భాగ్యనగర్ పరిధిలోని కూకట్‌పల్లిలో స్పా సెంటర్ పేరుతో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) బృందం మంగళవారం సాయంత్రం ‘చార్మ్ బ్యూటీ స్పా’పై ఆకస్మిక దాడి నిర్వహించారు.
పోలీసుల తనిఖీల్లో స్పా ముసుగులో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ దాడిలో ఆరుగురు బాధితులను పోలీసులు సురక్షితంగా కాపాడారు. ఘటనా స్థలంలో రిసెప్షన్ వద్ద ఉన్న ముగ్గురు నిర్వాహకులను అదుపులోకి తీసుకోగా, ఒక విటుడు పట్టుబడ్డాడు.
పోలీసులు నిందితుల వద్ద నుండి 4 స్మార్ట్‌ఫోన్లు, ₹9,100 నగదు, మరియు ఇతర అభ్యంతరకర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించి, తదుపరి విచారణ చేపడుతున్నారు.
“స్పా లేదా వెల్‌నెస్ సెంటర్ల పేరుతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి యాజమాన్యం తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్సులు, ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలి. నిబంధనలు అతిక్రమిస్తే సంస్థలను మూసివేయడమే కాకుండా చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం.” — కూకట్‌పల్లి పోలీసులు
ప్రజలు తమ పరిసరాల్లో ఇలాంటి అనుమానాస్పద లేదా అక్రమ కార్యకలాపాలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.