Take a fresh look at your lifestyle.

మున్సిపల్ లో చైర్ పర్సన్ అనన్య సుడిగాలి పర్యటన

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :

వికారాబాద్ పట్టణంలో సుడిగాలి పర్యటన జరిపిన మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య.
ఈ సందర్బంగా


బిజెర్ చౌరస్తా నుండి రామయ్య గూడ వరకు ఇటీవల శుభ్రం చేసిన ఓపెన్ డ్రైన్ ను పరిశీలించిన చైర్మన్ అనన్య. 23 వార్డు లోని ఆలంపల్లి ఈద్గా వద్ద రంజాన్ పండుగ రోజు జరిగే ప్రత్యేక ప్రార్థనల కోసం చేసే ఏర్పాట్లను పరిశీలించారు. ప్రార్ధనల సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆలంపల్లి బోనమ్మగుంత దేవాలయ పరిసరాలను పరిశీలించి, ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అవసరమైన మౌళిక వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. తదుపరి రామ్ మందిర్ ఎదురుగా మరియు అనంతగిరి రోడ్డు లోని లైబ్రరీ పక్కన ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను పరిశీలించి, శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం 29వ వార్డులోని మిషన్ కాంపౌండ్ లో ఉన్న ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని అకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో ఉన్న కిచెన్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్ధినిలతో పాటుగా భోజన చేసి, మెను ప్రకారం ఆహార పదార్థాలు పెడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. మెను ఫాలో కావాలని, బాలికలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రంసింహా రెడ్డి, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది చైర్మన్ గడ్డం అనన్యతో ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.