Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి

  • తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన.
  • సకాలంలో పోలీసుల రాకతో వాటర్ ట్యాంక్ పైకి ఎక్కిన కనకయ్యను రక్షించిన పోలీసులు.
  • సంచలనంగా మారిన కనకయ్య ఆత్మహత్యాయత్నం.
  • తన వద్ద 20 వేల రూపాయల డబ్బులు కాంగ్రెస్ నాయకుడు తీసుకున్నారని కనకయ్య ఆరోపణ.

తుంగతుర్తి, ముద్ర: తనకు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఇల్లు రాలేదని తన వద్ద కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకున్నారని తాను నిరుపేదనని తనకు ఇల్లు రానందుకు ఆత్మహత్య శరణ్యమని గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఒక వ్యక్తి హల్చల్ చేసిన సంఘటన తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో జరిగింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.వెలుగుపల్లి గ్రామానికి చెందిన బయ్య కనకయ్య తనకు ఇల్లు లేదని ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు.కాగా గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో తన పేరు రాలేదని విషయాన్ని తెలుసుకుని మనస్థాపంచింది గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. విషయాన్ని తెలుసుకున్న తుంగతుర్తి పోలీసులు సకాలంలో చేరుకుని కనకయ్యకు నచ్చజెప్పి వాటర్ ట్యాంక్ పై నుండి కిందికి దింపారు.ఈ విషయమే బాధితుడు కనకయ్య మాట్లాడుతూ తనకు ఇల్లు కోసం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకునికి 20వేల రూపాయలు ఇచ్చానని తెలిపారు. 50 వేల రూపాయలు ఇవ్వమని సదర్ నాయకుడు తనను కోరాడని ముందుగా 20 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా ఇవ్వడం జరిగింది అని తెలిపారు.నిరుపేదనైన నాకు డబ్బులు తీసుకొని కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తన తల్లిదండ్రులు కూడా గుడిసెలోనే చనిపోయారని తన కూడా అదే గతి పడుతుందని మనస్థాపనతో ఆత్మహత్య యత్నానికి పడ్డానని కనకయ్య తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు ఇండ్లు లేని వారికి ఇస్తారని తెలిపారని కానీ తమకు అన్యాయం జరిగిందని తనకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. కనకయ్య వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అందరూ అక్కడికి చేరుకుని కనకయ్యను బుజ్జగించి పోలీసుల సహకారంతో కిందికి దింపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ విషయం తుంగతుర్తి నియోజకవర్గంలో సంచలనం కాగా పలు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో జరుగుతున్న అవకతవకలపై చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని పలువురు నిరుపేదలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.