Take a fresh look at your lifestyle.

వ్యవసాయ శాస్త్రవేత్తగా రాణిస్తున్న రైతు బిడ్డ

 
బోథ్, ముద్ర:

ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కౌట- బి గ్రామానికి చెందిన డాక్టర్ లంకటి మహేష్ ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మీకుంట కృషి విజ్ఞాన్ కేంద్రం (కేవికే) లో వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త గా ఆయన దేశ వ్యాప్తంగా వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నాడు. రైతులు, గ్రామీణ యువత, విస్తరణ కార్మికులకు కేవికేలో వివిధ శిక్షణా కార్యక్రమాల ద్వారా సూచనలను సలహాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేవికే ద్వారా అందిస్తున్న శిక్షణలు, ప్రభావ అధ్యయనాలపై విస్తృతంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు అంశాలపై రైతులకు 42 శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాడు. 1718 మంది ట్రైనీలకు నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, వృత్తి శిక్షణా కార్యక్రమాలను చేపట్టాడు. భారత ప్రభుత్వం ద్వారా ప్రాయోజితం చేయబడిన ఎస్టీఆర్వై, ఏసీ & ఏ బీఎసీ, డీఏ ఈఎస్ఐ డీలర్స్ కి శిక్షణ ఇవ్వడం జరిగినది.
డాక్టర్ మహేష్ లంకటి ఇప్పటివరకు వ్యవసాయ రంగానికి సంబంధించి జాతీయ మరియు అంతర్జాతీయ జర్నల్స్ లో 22 వేర్వేరు పరిశోధనా పత్రాలు, 13 పుస్తక అధ్యాయాలను ప్రచురించారు . వివిధ వ్యవసాయ సమస్యలపై ప్రఖ్యాత పత్రికలలో 21 ప్రజాదరణ పొందిన వ్యాసాలను సైతం ప్రచురించారు. సొసైటీ ఆఫ్ కృషి విజ్ఞాన్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ (ఐఎస్ఏఎస్టీఆర్) నోయిడా, అడ్వాన్సెస్ ఇన్ లైఫ్ సైన్స్ జర్నల్, ట్రెండ్స్ ఇన్ బయోసైన్సెస్ జర్నల్ లలో జీవితకాల సభ్యత్వం పొందారు. ఈయన అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొన్నాడు, సుస్థిర అభివృద్ధిపై సారాంశాలు, పోస్టర్లను సమర్పించాడు. వ్యవసాయ రంగంలో ఈయన చేస్తున్న కృషికి గాను వివిధ విభాగాలలో నాలుగు అవార్డులను స్వీకరించారు.
2024 లో ఆయన రైతులకు చేసిన సేవలకు గాను ఉత్తమ కేవికే శాస్త్రవేత్త అవార్డును జిల్లా కలెక్టర్, ఐటీ మంత్రి చేతుల మీదుగా స్వీకరించాడు. 2024 లో ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెర్చ్ (ఐఎస్ఏఎస్టీఆర్) నోయిడా జర్గిన కాన్ఫరెన్స్ లో ఆయన చేసిన పరిశోధనలకు గాను ఉత్తమ వ్యవసాయ విస్తరణ విభాగ శాస్త్రవేత్త అవార్డును స్వీకరించారు
2025 లో హన్రాజ్ వ్యవసాయ విశ్వ విధ్యాలయం వారు నిర్వహించిన రెండవ అంతర్జాతీయ సాధస్సులో ఆయన వ్యవసాయ విస్తరణ విభాగoలో చేసిన కృషి గాను ఉత్తమ నవీన శాస్త్రవేత్త అవార్డును స్వీకరించారు. 2026 లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో పరిశోధన, ఆవిష్కరణలు & మహిళా సాధికారతపై 1వ అంతర్జాతీయ సదస్సు నందు గత ఐదేళ్ల నుండి కృషి విజ్ఞన కేంద్రం లో చెపట్టిన వివిధ కార్యక్రమాలకు గాను ఉత్తమ కేవికే శాస్త్రవేత్త అవార్డును స్వీకరించారు. డాక్టర్ మహేష్ ఆహార భద్రతను నిర్ధారించడానికి, జీవనోపాధిని మెరుగుపరచడానికి, సహజ వనరులను మెరుగ్గా నిర్వహించడానికి పర్యావరణాన్ని పరిరక్షించడానికి విశేష కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.