ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి:
……………………………………….
…………………………………
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక అంబేద్కర్ కళాభవన్‌లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, భారత దేశ ఐక్యతకు రాజ్యాంగమే బలమైన పునాది అని ఆయన పేర్కొన్నారు.
ఆయన ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు.ప్రతి కాలనీ, గ్రామాల్లో లైబ్రరీలు, స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.ఖాళీ ప్రభుత్వ భవనాలను విద్యా కేంద్రాలుగా వినియోగించనున్నట్టు వెల్లడించారు.సమాజంలో న్యాయం, సమానత్వం అత్యంత కీలకమని,ఓటు హక్కు విలువను గుర్తించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
చిన్న వ్యాపారాల ప్రోత్సాహం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని,యువత, మహిళలు స్వయం ఉపాధి వైపు దృష్టి పెట్టాలన్నారు.అంతకుముందు బస్ స్టాండ్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఖుష్బు గుప్తా, ఎస్ పి జానకి,మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మైనారిటి చైర్మన్ ఒబేదుళ్ల కొత్వాల్, నాయకులు వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post