ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ కు నోటీసులు
ముద్ర, హైదరాబాద్ :
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బాధాకరమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. దాని వెనక ఉన్న వారికి శిక్షపడాల్సిందేనని చెప్పారు. గురువారం జూబ్లీహీల్స్ లోని ఖాజా మెన్షన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఉన్నందునే ప్రభుత్వం సిట్ అధికారులతో కేసీఆర్ కు నోటీసులు ఇప్పించిందన్నారు. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా లేదన్నారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. విచారణను వేగవంతం చేసి… త్వరగా కేసును పూర్తి చేయాలని సిట్ అధికారులను కోరారు. అయితే ఫోన్ ట్యాపింగ్ నేరస్తులకు శిక్ష పడుతుందా.? లేదా.? అని వేచి చూడాల్సిందేనన్నారు.