- ఎమ్మెల్యే విజయరమణ రావు
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: అమరవీరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, మున్సిపల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, అమరవీరులకు ఈరోజు నివాళులు అర్పించడం ఎంతో అవసరమన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక – ఒక్క మార్పు అభివృద్ధికి మలుపు అనే నినాదంతో ఏర్పాటు చేసిన పోస్టర్ ను పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆవిష్కరించి నాయకులు, మున్సిపల్ సిబ్బంది మెప్మా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మెప్మా ఎస్.ఎస్.హెచ్ సంఘం మహిళలకు రూ.2 కోట్ల 69 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం పెద్దపల్లి మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, వెంకటేష్, జిల్లా గ్రంధాలయ చైర్మన్, అన్నయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్, ఈర్ల స్వరూప, మాజీ కౌన్సిలర్లు,నూగిళ్ల మల్లయ్య,, భూతాగడ్డ సంపత్, సాయద్ మాసర్త్, సందవేణి రాజేందర్, బండారు రామూర్తి, కడర్ల శ్రీనివాస్, కట్కూరి సుధాకర్ రెడ్డి, బొంకురి అవినాష్, జగదీష్, శ్రీమాన్, సుభాష్, నాదేం, బొడ్డుపల్లి శ్రీనివాస్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్పీలు, ఓబీలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
