ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రం లోని మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కి చెందిన 9 వ తరగతి విద్యార్థి శివ కుమార్ సౌత్ ఇండియ స్కూల్ క్రికెట్ చాంపియన్ షిప్ -2025 కి ఎంపిక అయినట్లు ప్రిన్సిపాల్ రజిత రావు తెలిపారు. గత నెల జూన్ 20 నుండి 22 వరకు మహబూబాబాద్ లో జరిగిన 4వ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో శివ కుమార్ అద్భుత ప్రదర్శనతో చాంపియన్ గా నిలిచి ఈ నెల జూలై 11 నుండి 13 వరకు ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు లో జరగనున్న సౌత్ ఇండియ స్కూల్ క్రికెట్ చాంపియన్ షిప్ -2025 టీమ్ కి ఎంపిక అయ్యాడు. ఈ సందర్భం గా ప్రిన్సిపాల్ రజిత రావు, విద్యార్థి శివ కుమార్ ని అభినందిస్తూ,మరోసారి తన అద్భుత ప్రదర్శన తో టోర్నమెంట్ లో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ లు శ్రీధర్ రావు,హరిచరణ్ రావు,మౌనిక రావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.