- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు.
తుంగతుర్తి, ముద్ర:ఈనెల 14న తిరుమలగిరి లో పేద ప్రజానీకానికి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారని ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ కోరారు గురువారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ముఖ్యమంత్రి సభకు సన్నాహక సమావేశంలో భాగంగా మండల కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ తిరుమలగిరిలో జరగడం ఎంతో సంతోషకరమని ఈ సభ ఏర్పాటుకు జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి కృషి చేయడం హర్షణీయమని అన్నారు .రాష్ట్రంలో ప్రజా పాలన జోరుగా సాగుతుందని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని అన్నారు సన్న బియ్యం ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా రైతు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లాంటి పథకాలను ఇప్పటికే అమలు చేశారని ఇంకా చేయాల్సిన పథకాలను సైతం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు తిరుమలగిరిలో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తే తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధిపై ముఖ్యమంత్రి సైతం దృష్టి సారిస్తారని తద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మంజూరి అవుతాయని నాయకులు కార్యకర్తలు దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని కోరారు ఈ సమావేశానికి సుమారు 60 వేల మంది హాజరుకానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హాజరుకానున్న భారీ బహిరంగ సభను నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో పేద ప్రజల కోసం అనేక పథకాలు అమలవుతున్న తీరును ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు రానున్న కాలంలో రాష్ట్రంలో ఇటు తుంగతుర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు అవుతాయని అన్నారు ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొంగారి గోవర్ధన్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న కాంగ్రెస్ నాయకులు రేగడి రవి ఝాన్సీ రెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్రు అనిల్ లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
