ముద్ర న్యూస్ బ్యూరో: హైదరాబాద్: యావద్దేశాన్నీ తీవ్ర దిగ్భ్రాంతికి, అంతులేని విషాదానికీ గురిచేసిన పహల్గావ్ ఊచకోతను ఖండిస్తూ శ్రీరామానుజ సేవాట్రస్టు పిలుపు మేరకు గురువారం నాడు రాజకీయ పార్టీలకు అతీతంగా జరిగిన సమావేశంలో వందలాది మంది పాల్గొన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కొవ్వొత్తులు వెలిగించి అమాయక మృతులకు ఘనంగా నివాళి సమర్పిస్తూ జరిగిన ఈ సంఘీభావ సమావేశంలో -ముఖ్య అతిథిగా పాల్గొన్న విహెచ్ పి జాతీయ అధికార ప్రతినిధి శ్రీ రావినూతల శశిధర్ గారు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

మతోన్మాదం తలకెక్కిన రాక్షసులు అమాయక హిందువులను పొట్టనపెట్టుకున్న అమానుషంపై భారత సమాజమంతా సమైక్యంగా స్పందించాలని, మళ్లీ ఇలాంటి దుస్సాహసానికి సంబంధించిన ఆలోచన చేయడానికి సైతం భయపడేలా మన ప్రతిస్పందన వుండాలని అన్నారు. ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం ఎంతటి తీవ్ర ప్రతీకార స్పందనకు దిగినా దాన్ని యావద్దేశం ముక్తకంఠంతో స్వాగతించాలని అన్నారు.