Take a fresh look at your lifestyle.

అనర్హుల చేతుల్లో దుకాణాలు

 

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌ దుకాణం దక్కించుకున్న డీలర్‌, వివిధ కారణలతో తొలగించిన డీలర్ల స్థానంలో కేటాయించిన ఇన్‌చార్జీలు మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అలా కాకుండా బినామీలు నిర్వహిస్తూ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి తోడు డీలర్లకు మాత్రమే తెలియాల్సిన ఈ-పాస్‌ మిషన్ల కీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బినామీల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో వారే ఓపెన్‌ చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారు.. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ దుకాణాలను తనిఖీ చేసి బినామీల వివరాలు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశించింది. అయితే జిల్లాలో ఒక్క బినామీ డీలర్‌ కూడా లేడు అని అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. గద్వాల జిల్లాలో 333 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. గద్వాల పట్టణంలో సుమారు 24‌‌రేషన్ దుకాణాలున్నాయి‌ అందులో నాలుగు షాపులకు తాత్కాలిక డీలర్లను నియమించారు, మరో అయిదు రేషన్ దుకాణాలు ఇతరుల పేరు మీద ఉంటే సంబందం లేని వ్యక్తులు బినామీ డీలర్లు గా కొనసాగిస్తున్నారు. వారి పేరిట ఉన్న దుకాణాలను అనర్హులైన ఇతరులకు కట్టబెడుతున్నారు. బినామీల వేలిముద్రలను ఏకంగా ఈ-పాస్‌ యంత్రాల్లో నమోదు చేస్తున్నారు. ఇదంతా తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగుతోంది. బినామీల బ్యాంకు ఖాతాలే పౌర సరఫరాల శాఖ వద్ద ఉంటున్నాయి. కమీషన్‌ వారి ఖాతాల్లోకే వెళ్తోంది. చౌక ధరల దుకాణాల్లో ఇప్పటికే సరకులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటే ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వేలిముద్రలు మార్చుతున్నారిలా..
రేషన్‌ డీలర్లతో పాటు వారి కుటుంబసభ్యుల్లో మరో ఇద్దరికి ఈ-పాస్‌ యంత్రంలో వేలిముద్రలు వేసే అధికారం కల్పించారు. డీలర్‌ అందుబాటులో లేకుంటే ఆయన కుటుంబసభ్యులు రేషన్‌ పంపిణీ చేయాలి. బయోమెట్రిక్‌ యంత్రంలో వేలి ముద్రలు మార్చే అధికారం తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికే ఉంటుంది. కొన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని సిబ్బంది.. బినామీల వేలిముద్రలు మార్చుతున్నట్లు స్పష్టమవుతోంది. రేషన్‌ దుకాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశముంది. అనర్హులను ఏరివేసి అర్హులైన యువతకు దుకాణాలు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. తనిఖీలు చేసి బినామీలపై చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో స్వామి కుమార్ తెలిపారు.

ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి: జోగుళాంబ గద్వాల జిల్లాలో రేషన్‌ దుకాణాల నిర్వహణ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. పేరు ఒకరిదైతే నిర్వహణ మరొకరు చేస్తూ రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌ దుకాణం దక్కించుకున్న డీలర్‌, వివిధ కారణలతో తొలగించిన డీలర్ల స్థానంలో కేటాయించిన ఇన్‌చార్జీలు మాత్రమే సరుకులు పంపిణీ చేయాలి. అలా కాకుండా బినామీలు నిర్వహిస్తూ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. దీనికి తోడు డీలర్లకు మాత్రమే తెలియాల్సిన ఈ-పాస్‌ మిషన్ల కీ రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బినామీల చేతుల్లోకి వెళ్లాయి. దీంతో వారే ఓపెన్‌ చేసి బియ్యం పంపిణీ చేస్తున్నారు.. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌ దుకాణాలను తనిఖీ చేసి బినామీల వివరాలు ఇవ్వాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆదేశించింది. అయితే జిల్లాలో ఒక్క బినామీ డీలర్‌ కూడా లేడు అని అధికారులు సమాధానం ఇవ్వడం గమనార్హం. గద్వాల జిల్లాలో 333 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. గద్వాల పట్టణంలో సుమారు 24‌‌రేషన్ దుకాణాలున్నాయి‌ అందులో నాలుగు షాపులకు తాత్కాలిక డీలర్లను నియమించారు, మరో అయిదు రేషన్ దుకాణాలు ఇతరుల పేరు మీద ఉంటే సంబందం లేని వ్యక్తులు బినామీ డీలర్లు గా కొనసాగిస్తున్నారు. వారి పేరిట ఉన్న దుకాణాలను అనర్హులైన ఇతరులకు కట్టబెడుతున్నారు. బినామీల వేలిముద్రలను ఏకంగా ఈ-పాస్‌ యంత్రాల్లో నమోదు చేస్తున్నారు. ఇదంతా తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగుతోంది. బినామీల బ్యాంకు ఖాతాలే పౌర సరఫరాల శాఖ వద్ద ఉంటున్నాయి. కమీషన్‌ వారి ఖాతాల్లోకే వెళ్తోంది. చౌక ధరల దుకాణాల్లో ఇప్పటికే సరకులు పక్కదారి పడుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటే ఎవరు జవాబుదారీ వ్యవహరిస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వేలిముద్రలు మార్చుతున్నారిలా..
రేషన్‌ డీలర్లతో పాటు వారి కుటుంబసభ్యుల్లో మరో ఇద్దరికి ఈ-పాస్‌ యంత్రంలో వేలిముద్రలు వేసే అధికారం కల్పించారు. డీలర్‌ అందుబాటులో లేకుంటే ఆయన కుటుంబసభ్యులు రేషన్‌ పంపిణీ చేయాలి. బయోమెట్రిక్‌ యంత్రంలో వేలి ముద్రలు మార్చే అధికారం తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందికే ఉంటుంది. కొన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లోని సిబ్బంది.. బినామీల వేలిముద్రలు మార్చుతున్నట్లు స్పష్టమవుతోంది. రేషన్‌ దుకాణాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తే వాస్తవాలు బయటపడే అవకాశముంది. అనర్హులను ఏరివేసి అర్హులైన యువతకు దుకాణాలు కేటాయించాలని పలువురు కోరుతున్నారు. తనిఖీలు చేసి బినామీలపై చర్యలు తీసుకుంటామని డీఎస్‌వో స్వామి కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.