Take a fresh look at your lifestyle.

రేపటి సాయంత్రం వరకు భగీరథ నీటి సరఫరా ఉండదు ఈఈ నాగభూషణం

ముద్ర ప్రతినిధి, మెదక్:
సమ్మర్ యాక్షన్ ప్లాన్ తయారీలో భాగంగా ఈనెల 5,6 తేదీలలో క్రింది ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గ పరిధిలోని 275 గ్రామీణ హాబిటేషన్లు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలు.
ఆందోలు నియోజకవర్గంలోని అల్లాదుర్గ్, టేక్‌మాల్ మండలాలో 80 హాబిటేషన్లు ఉన్నాయి.
ప్రభావిత హాబిటేషన్ల సర్పంచ్‌లకు సంబంధిత మండల గ్రూపుల ద్వారా సమాచారం అందించబడిందని తెలిపారు..
స్థానిక వనరుల ద్వారా నీటి సమస్యను పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
90 ఎమ్మెల్డీ పెదరెడ్డిపేట – వివిధ నిర్వహణ పనుల నిమిత్తం
1000 మి.మీ. డయా పైప్‌లైన్ లీకేజీల మరమ్మత్తు, రాయిపహాడ్ ఓ హెచ్ బి ఆర్ వద్ద స్లూయిస్ వాల్వ్ మరమ్మత్తు,
అన్ని సివిల్ నిర్మాణాలు శుభ్రపరచడం వంటివి చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఎల్లాపూర్ వద్ద 700 మి.మీ. డి1 స్లూయిస్ వాల్వ్ మరమ్మత్తులు చేస్తున్నామన్నారు.
6న సాయంత్రం 6 గంటల తరువాత పంపింగ్ పునః ప్రారంభించబడుతుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.