Take a fresh look at your lifestyle.

పట్టణాభివృద్ధికి సహకరించండి- మంత్రి జూపల్లితో మున్సిపల్ చైర్మన్

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:

నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఈ మేరకు బుధవారం వారు మంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారు. నిర్మల్ పై ప్రత్యేక శ్రద్ధ చూపి అభివృద్ధికి సహకరించాలని వారు కోరారు. నిర్మల్ అభివృద్ధితో పాటు పట్టణంలోని చారిత్రిక ప్రాధాన్యత ఉన్న శ్యాం ఘడ్, బత్తిస్ ఘడ్ లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని విన్నవించారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. మాజీ మంత్రి ఎస్ వేణుగోపాల చారి, నిర్మల్ నియోజక వర్గ ఇంచార్జి కె శ్రీహరి రావు కూడా వారివెంట ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.