ముద్ర, వనపర్తి :
వనపర్తి పట్టణం 23వ వార్డు చెందిన మురళీధర్ రెడ్డి మృతి చెందారు అన్న విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి శనివారం బాధిత కుటుంబాన్ని ప్రమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మురళీధర్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
మురళీధర్ రెడ్డి మృతి చెందడానికి గల కారణాలను కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవసరాలు ఉన్న తనను ఎప్పుడైనా సంప్రదించ వచ్చునని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సూచించారు.
కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ అధ్యక్షులు ఎత్తం రవి, పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్య రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post