Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి సహాయా నిధి చెక్కు పంపిణీ.

 
మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన మారుపాక మమత ఇటీవల అనారోగ్యం తో బాధపడుతూ హైద్రాబాద్ లోని రెనోవ ప్రవేట్ హాస్పిటల్ ఆస్పత్రిలో చత్ర చికిత్స పొందడం జరిగింది . వారి కుటుంబానికి హార్దిక ఇబ్బందులు రావడం తో అదే గ్రామానికి చెందిన రాధారపు మల్లేశం ఉపసర్పంచ్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు వారిని కలువగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుంగతుర్తి నియోజకవర్గం ఇంచార్జ్ కడియం రామచంద్రయ్య దృష్టికి తీసుకెళ్లగా వారు ఆసుపత్రి బిల్లులు సేకరించి వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పేషెంట్ ను తీసుకెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో వారికి 12000 వేల రూపాయల హార్దిక సహాయం కడియం రామచంద్రయ్య చేతులమీదుగా తన నివాసంలో శుక్రవారం బాధితులకి చెక్కు అందజేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండ శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.