Take a fresh look at your lifestyle.

మత్స్యావతారంలో దర్శనమిచ్చిన నృసింహుడు..

సాయంత్రం శేష వాహన సేవ..

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాలలో శుక్రవారం ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారిని మత్స్యావతారంలో అలంకరించి భక్తుల దర్శనార్ధం తిరువీధులలో ఊరేగింపు వేడుక నిర్వహించారు. ఈ వేడుకలలో ఆలయప్రధానార్చకులు, ఉపప్రధానార్చకులు, యజ్ఞాచార్యులు, వేదపండితులు అర్చకబృందం పారాయణీకులు కార్యనిర్వహణాధికారి జె. భవానీశంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహామూర్తి, ఉపకార్యనిర్వహణాధికారిగారు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

మత్స్యావతార అలంకార శేవ విశిష్టత

శ్రీమన్నారాయణుని యొక్క విభవ అవతారములలో అత్యంత ప్రసిద్ధి చెందినది మత్స్యావతారము. ఈ అవతారము స్వామి యొక్క భక్త రక్షణ తత్పరతను మరియు సృష్టి కార్యానికి ఆటంకం కలిగించే దానవుల సంహారము బ్రహ్మాది దేవతలకు సృష్టిని నిర్వహించుటకు వేదములను అనుగ్రహించుట మొదలగు ఎన్నో విశేషములను తెలియజేయుచున్నది. ఈ లోకములన్నీ తన సంతానం కనుక వారిని కూడా తన చల్లని చూపులతో సంరక్షించు తత్త్వం ఈ మత్స్యావతారములోని విశిష్టత.

సాయంకాల కార్యక్రమాలు
సాయంకాలం శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాదనల అనంతరం రాత్రి శ్రీ స్వామివారిని శేష వాహన శేవలో అలంకరించి తిరుపూడ ప్రదానార్చకులు, ఉపప్రదానార్చకులు, యజ్ఞాచార్యులు, పారాయణీకులు అత్యంత వైభవముగా ఊరేగింపు వేడుక నిర్వహించారు.

శేష వాహన సేవ ప్రత్యేకత

భూమండలమును తన వాహనము అనగా మోయునది లేదా తీసుకువచ్చునది అని అర్ధము, ఆదిశేషుడు సమస్త శిరస్సుపై మోయుట సర్వలోకాధిపతి అయిన భగవానునికి శయ్యగామారుటభగవానుడు ఈ లోకంలో నడయాడినప్పుడు పాదుకలుగా, కూర్చున్నప్పుడు ఆసనముగా, వివిధ ప్రక్రియలలో కైంకర్యములను నిర్వహించుచూ ఆదిశేషుని వాహన సేవ బ్రహ్మోత్సవ ఆదిలోనే వాహన శేవగా నిర్వహింపబడుట ఎంతో విలక్షణమై ఉన్నది.

Leave A Reply

Your email address will not be published.