Take a fresh look at your lifestyle.

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి మెదక్:
అగ్నిమాపక వారోత్సవాల సందర్బంగా కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పోస్టర్‌ను విడుదల చేశారు. అగ్నిప్రమాదాల నివారణలో ప్రజల్లో అవగాహన చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇళ్లలో, కార్యాలయాల్లో, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి జి. వేణు మాట్లాడుతూ… ఈనెల 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ అవగాహన కార్యక్రమాలు, మాక్ డ్రిల్స్, భద్రతా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.