- తెలుగు రాష్ట్రాల సీఎంలు, సీఎస్‌లు, డీజీపీతో కేంద్రమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యకైనా దిగొచ్చన్న సమాచారంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది.ఈ మేరకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేశారు.ఇలాంటి సున్నితమైన సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తుండాలన్నారు.కేంద్రం తీసుకునే నిర్ణయాలు, దాని వలన ఎదురయ్యే పరిణామాల గురించి సీఎంలతో అమిత్ షా చర్చించారు.