Take a fresh look at your lifestyle.

ఫీజుల దోపిడీ నియంత్రించాలని కలెక్టరేట్ ఏవోకి వినతి పత్రం

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కి, ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏవో అంజిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ “ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తెచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ట్యూషన్ ఫీజు, డెవలప్మెంట్ ఫీజు, బిల్డింగ్ ఫండ్ పేరుతో పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులను నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి లోకేష్, జిల్లా నాయకులు మహేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.