Take a fresh look at your lifestyle.

మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌కు శుభాకాంక్షల వెల్లువ

​ముద్ర కూకట్‌పల్లి :
తెలుగు నూతన సంవత్సరమైన ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ శుభ సందర్భంగా డివిజన్‌లోని పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేయోభిలాషులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా దొడ్ల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, తెలుగు ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. రాబోయే కాలంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో గడపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, ఉన్నతమైన ఆశయాలు మరియు వినూత్న ఆలోచనలతో నవ వసంతంలా ఆనందమయం కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో నాయకులు పట్వారి శశిధర్, చిన్నోళ్ల శ్రీనివాస్, అగ్రవాసు, సంగమేష్, హరీష్, వెంకటేష్, యాకయ్య గౌడ్, మహేష్, నాగరాజు, రాజు గౌడ్, బాబ్జి, పంతులు, వెంకట్, శివ, ప్రవీణ్, మోహన్ మరియు ఇతర కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.