Take a fresh look at your lifestyle.

వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ

  • పనులు ప్రారంభించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి కల్వకుర్తి : ఉర్కొండ మండలం ఉర్కొండ పేట ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ , టాస్క్ సి ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 5 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేశారు.దేవాలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రక్షిత త్రాగునీటికోసమై దేవాలయకమిటీ కోరికమేరకు ఐక్యత ఫౌండేషన్ సహకారంతో ఐదు లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి పూజ చేసి పనులుప్రారంభించడం జరిగింది.తన ఇష్టదైవం శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి నీ దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎంతో ప్రాముఖ్యత కలిగిన పబ్బతి ఆంజనేయస్వామి వారికి తన వంతు సేవ చేసుకొనే భాగ్యం దక్కడం సంతోషంగా ఉందని అన్నారు.కార్యక్రమంలో,దేవాలయ పాలకమండలి చైర్మన్ సత్య నారాయణ రెడ్డి, ఈ.వో సత్య చంద్రారెడ్డి,ఊరుకొండ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ధ్యాప నిఖిల్ రెడ్డి,పిఎసిఎస్ మాజీ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి,అయూబ్ పాషా,రమేష్ నాయక్,అబ్దుల్ సమీ,గోపి,శ్రీనివాసులు,యూత్ ప్రెసిడెంట్ ఆదినారాయణ, వహీదోద్దీన్,మనోహర్ రెడ్డి, ఆరిఫ్,పాలకమండలి సభ్యులు ఆలయ అర్చకులు దత్తాత్రేయ శర్మ ,మహేష్, మాజీ ప్రజా ప్రతినిధులుతదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.